బాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్య ప్రసాద్ లు పర్యటించారు. మండలంలోని ముంపుగ్రామాల్లో ఒకటైన బొబ్బరలంక వాసులు సుమారు 50 కుటుంబాలు ఉంటున్న పునరావాస కేంద్రానికి వెళ్లి మంత్రులు పరిశీలించారు. వారికి అందుతున్న సహాయక చర్యలపై మంత్రులు ఇరువురు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతీ ఒక్క వరద బాధితునికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.