-న్యూడ్ ఫొటోలు, వీడియోలతో ఆపరేటర్ బెదిరింపు
-సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
-రంగంలోకి అధికారులు…ఘటనపై కలెక్టర్ సీరియస్
నిజామాబాద్: స్కానింగ్‌కు వచ్చే మహిళలు, యువతుల న్యూడ్ ఫొటోలు, వీడియో లు చిత్రీకరిస్తూ బెదిరిస్తున్న ఘటన నిజామాబాద్‌లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో చోటుచేసుకుంది. సెంటర్‌లోని ఆపరేటర్ గత కొంతకాలంగా స్కానింగ్ కోసం వచ్చే యువతులు, మహిళల న్యూడ్ ఫొటోలు, వీడియోలు తీస్తున్నాడు. ఆ తరువా త వాటిని చూపించి బెదిరింపులకు దిగుతున్నాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఫొటోలు వైరల్ కావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఘటన పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.