-విడాకులివ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న భర్త
-రెడ్‌హ్యాండెడ్‌గా ఇద్దరినీ పట్టుకున్న నక్షత్ర
-సినిమా ఆడిషన్‌కు వచ్చిందని తప్పించుకునే ప్రయత్నం
విశాఖపట్నం: తన భర్త తనకు కావాలంటూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగింది. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండ్‌గా పట్టుకుంది. నక్షత్ర ఎంట్రీతో భర్త తేజ షాక్ అయ్యాడు. కాగా 2017లో తేజను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ 2013లో ఓ సినిమా షూటింగ్లో పరిచయం ఏర్పడిరది. అయితే భర్త తేజ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన మీద తప్పుడు కేసులు పెటారని, కేసు కోర్టులో ఉందని తెలిపాడు. ఇది ఇల్లు కాదని సినిమా ఆఫీసు అని, అమ్మాయి సినిమా ఆడిషన్‌కు వచ్చిందని తప్పించుకునే ప్రయత్నం చేయడం విశేషం.