అమెరికాలో తెలుగు యువతి అదృశ్యం

హైదరాబాద్‌:  అమెరికాలో భారతీయ విద్యార్థులు వరుసగా సమస్యల్లో చిక్కుకో వడం కలకలం రేపుతోంది. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో హైదరాబాద్‌కు చెం దిన కందుల నితీశ అనే యువతి అదృశ్యమైంది. మే 28 నుంచి ఆమె కనిపిం చకుండా పోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ప్రజల సాయం కోరారు. ఆమె గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.