వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే బలరాముడు

విజయవాడ, మహానాడు: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. మోకాల్లోతు నీటిలో నడిచి మరి బాధితుల వద్దకు వెళ్లి అండగా నిలుస్తున్నారు. ట్రాక్టర్, జెసిబి లతో విజయవాడలోని సింగ్ నగర్ లో గల 58, 59 డివిజన్ లలో ఎమ్మెల్యే, ఆయన అభిమానులు, కూటమి నాయకులు సహాయక చర్యలను చేపట్టారు. రాజానగరం నుంచి ఐదువేల బిర్యానీ ప్యాకెట్లు, 5 వేలకు పైగా వాటర్ బాటిల్ లను తీసుకువెళ్లి వేలాదిమందికి పంచిన ఆయన.. బుధవారం కూడా సహాయక చర్యలో పాల్గొన్నారు.