విజయవాడ, మహానాడు: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నంబూరు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు పి.ధనలక్ష్మికి బొలిశెట్టి శ్రీనివాస్ మూడు చక్రాల సైకిల్ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.