అండర్ 19 రాష్ట్ర జట్టుకు ఎంపికైన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే

జగ్గయ్యపేట పట్టణానికి చెందిన టి. వరుణ్ సాత్విక్, ఎన్. రాజేష్ లు ఆంధ్ర రాష్ట్ర అండర్ 19 మల్టీ డేస్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈరోజు జగ్గయ్యపేట జీ.వీ.జే బాయ్స్ హైస్కూల్లో గల బివి సాగర్ మెమోరియల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నెట్స్ వద్దకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వెళ్లి వారిని అభినందించారు.

బీసీసీఐ ఆల్ ఇండియా కూచ్ బీహారి ట్రోఫీ ఈనెల నవంబర్ 6 తేదీ నుండి డిసెంబర్ 6 వరకు జరుగునుంది. ఈ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు వరుణ్ సాత్విక్ (బ్యాటర్ గాను), రాజేష్ (ఆఫ్ స్పిన్నర్) గాను ఆడతారని కోచ్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రెటరీ మైనేని రాధాకృష్ణ, సుధీర్, జానీ, సూర సతీష్ తదితరులు పాల్గొన్నారు.