వర్షంలోనూ ఎమ్మెల్యే దివ్య పింఛన్లు పంపిణీ

– అభినందించిన లబ్ధిదారులు

డి.పోలవరం, మహానాడు: చంద్రబాబు ప్రభుత్వం ఓరోజు ముందే పెన్షన్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తే ఎమ్మెల్యే యనమల దివ్య జడివానలను లెక్క చేయకుండా డి.పోలవరం, కోటనందూరు గ్రామాలకు వెళ్ళి నేతలు యనమల రాజేష్, అంకం రెడ్డి నానబ్బాయి, సర్పంచ్ పలకా సోమేశ్వరరావులతో కలిసి పెన్షన్లను పంపిణి చేశారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మండల అధ్యక్షుడు గాడి రాజబాబు అధ్యక్షతన కోటనందూరు లో జరిగిన కార్యక్రమంలో పెంటకోట భాస్కర సత్యనారాయణ, లోవ చైర్మన్‌ గొర్లె అచ్చయ్య నాయుడు, మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు, అంకారెడ్డి రమేష్, పోతల సూరిబాబు, వెలగా వెంకట కృష్ణారావు, బోడపాటి సత్యనారాయణ, అంకారెడ్డి రాజశేషు, ఎర్రా చిన సత్యనారాయణ, ఎల్‌.ఎస్‌. అంకారెడ్డి, వెంకటేష్, బంటుపల్లి వెంకటేశ్వరరావు, సామినీడి కృష్ణార్జున్, వాసం నాగేశ్వరరావు, రుత్తల శ్రీనివాస్, గంటా అమ్మాజీ, మేడపురెడ్డి జోగి బాబు తదితరులు పాల్గొన్నారు.

తుని ఇసుకలపేట్ల కమిషనర్ వెంకట్రావు అధ్యక్షత జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దివ్య హాజరైయ్యారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్‌లతో కలిసి ఇసుకలపేటలో దివ్య పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, కూటమి నేతలు మల్ల గణేష్, కుక్కడపు బాలాజీ, నార్ల రత్నాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాతబాబు, రామచంద్రరాజు, తదితరులు పాల్గొన్నారు.