ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె పర్యటన

విజయవాడ, మహానాడు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి శనివారం ఉదయం పర్యటించారు. 4వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ, భారతీనగర్, సి.టి.ఓ కాలనీ, వెంకటేశ్వరనగర్, అంబేద్కర్ నగర్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, గుణదల హరిజన వాడలతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడున్న పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తూమాటి ప్రేమనాథ్, మిక్కిలినేని బుజ్జి, యలమంచలి రాజా, కె.వెంకటేశ్వరరావు, కోనేరు సురేష్, మండవ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.