ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళం

– సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు అందజేత

విజయవాడ, మహానాడు: వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నాయకుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళాన్ని ప్రకటించారు. సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వరబాధితులను ఆదుకోవడానికి తన శివశక్తి బయో టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ, శివశక్తి ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షలు సాయాన్ని సీఎం చంద్రబాబును కలిసి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో శివశక్తి కంపెనీ చైర్మన్ నందిగం శ్రీనివాసరావు, శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి, వినకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, తదితరులు పాల్గొన్నారు.