వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయం లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో మీలాదుల్ నబి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ముఖ్యఅతిథిగా మాజీ శాసన సభ్యుడు మక్కెన మల్లికార్జున రావు హాజరై మాట్లాడుతూ మానవులంతా ఒకటేనని ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమ భావం, శాంతి భావన కలిగి ఉండాలని ప్రవక్త మహమ్మద్ బోధించారని అన్నారు. స్త్రీలను గౌరవించాలని, స్త్రీల హక్కుల కోసం అందరూ పాటుపడాలని ప్రవక్త బోధించారని చెబుతూ వ్యభిచారం, మద్యపానం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. పేద, ధనిక వ్యత్యాసాలు.. కుల, మత వ్యత్యాసాలు వీడి మానవులు సోదరుల వలే కలిసిమెలగాలన్న ప్రవక్త బోధ సర్వమానవాళికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పఠాన్ షమీంఖాన్, పార్టీ నాయకులు సౌధగర్ జానీ భాష, షేక్ ఖాసిం, దస్తగిరి, చికెన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.