అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కన్నా శంకుస్థాపనలు

సత్తెనపల్లి, మహానాడు: వచ్చే ఐదేళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని శాసన సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సంకల్పించామని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చి తీరుతామని, పేదలకు, రైతులకు, మహిళా సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నకరికల్లు మండలం, రూపేనగుంట్ల గ్రామంలో రూ.10 లక్షలు, దేచవరం గ్రామంలో రూ.10 లక్షలు కండ్లగుంట రూ. 8 లక్షలు, చీమలమర్రి రూ. 8 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లకు, రూ. 2 లక్షల విలువైన రెండు గోకులం షెడ్స్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలల్లో నట్టల నివారణ కొరకు మందులు పంపిణీ చేశారు.