Mahanaadu-Logo-PNG-Large

వైద్యశాలలో ఘనంగా ఎమ్మెల్యే కన్నా జన్మదిన వేడుకలు

సత్తెనపల్లి, మహానాడు: పల్నాడు జిల్లా, సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఘనంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి రోగులకు బ్రెడ్, పండ్లు ఎమ్మెల్యే కన్నా పంపిణీ చేశారు. ఆసుపత్రి మొత్తం కలియతిరిగి రోగులను పరామర్శించారు. రానున్న రోజుల్లో ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి దిశగా మారుస్తానని ఆసుపత్రి సిబ్బందికి హామీ ఇచ్చారు. కార్యక్రమం లో పాల్గొన్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ బీబీ లక్ష్మణరావు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.