సిగ్గు శరం లజ్జ ఉందా?

దానం నాగేందర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి 

హైదరాబాద్, మహానాడు:  కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ లో చేరి కేసిఆర్ దయవల్ల రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో చేరి కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నవ్ నీకేమైనా సిగ్గు శరం లజ్జ ఉందా?  అని దానం నాగేందర్ పై తీవ్రంగా మండి పడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…

కేటీఆర్ పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను  ఖండిస్తున్నా. తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. 2018 జూన్ 22న బీఆర్ఎస్ లో చేరినప్పుడు మీరు చెప్పిన మాటలేంటి… కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అని బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ దయ వల్ల రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీడీలు అమ్ముకునే దానం నాగేందర్ ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించావు? నీ ఇంటి చుట్టూ, హైదరాబాద్ లో చేసిన కబ్జాలు మా దృష్టికి వచ్చాయి.

అన్నీ బయటకు తీస్తాం. పార్టీ మారిన నేతలందరూ రాజీనామా చేసి మళ్ళీ గెలవండి. అమ్ముడు పోయిన వ్యక్తి నీతులు చెబుతున్నాడంటూ దానం నాగేందర్ పై విమర్శలు గుప్పించారు.