టీడీపీ సభ్యత్వ నమోదు పర్యవేక్షించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు

మైలవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ధృవీకరణ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కొన్ని కుటుంబాలకు పరిమితమైన అధికారం పదవులను అందరికీ అందేలా చేసింది టీడీపీనే అన్నారు.

టీడీపీ సభ్యత్వం నమోదులో రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకొన్న వారికి.. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా సదుపాయాన్ని రూ.5 లక్షలకు పెంచారన్నారు. దీంతో పాటు కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నేతలు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో మరింత విస్తృతంగా సభ్యత్వాలను నమోదు చేయాలన్నారు.

వాట్సాప్, టెలిగ్రామ్, ఆన్ లైన్ లో టీడీపీ మెంబర్ షిప్ పొందవచ్చు. అలాగే రెన్యువల్ చేసుకోవచ్చన్నారు. టీడీపీ సభ్యత్వాన్ని మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి… వాట్సాప్ ద్వారా అయితే https://bit.ly/4eK2Lj5 లింక్ ను, టెలిగ్రామ్ ద్వారా అయితే https://t.me/MyTDP_bot లింక్ ను లేదా https://telugudesam.org/membership-2024-26/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపారు.