– క్రీడాకారులకు రూ. 10 వేలు సాయం
గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో సహాయం కోరి తన కార్యాలయానికి వచ్చే పేదలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి బాసటగా నిలుస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజల నుండి బుధవారం ఆమె అర్జీలు స్వీకరించారు. తురగ వెంకట పిచ్చయ్య కుమారుడు కరుణ్ కుమార్ కు రెండు కిడ్నీలు పాడయిపోయాయి. హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ బాలునికి వైద్య ఖర్చులు భరించలేకపోతున్నాం అని, తమ కుమార్తునికి ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్ ను కొత్తది మంజూరు చేయించి తమ కుటుంబాన్ని ఆదుకోవల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే వేణు సిలివేరు, సుబ్రహ్మణ్యంలు వినికిడి, మూగ క్రీడాకారులు. వీరు బీహార్ రాష్ట్రం పాట్నాలో అక్టోబర్ 13 నుండి 19వరకు జరిగే “ఇండియన్ డెఫ్ (వినికిడి) క్రికెట్ అసోసియేషన్ ఎనిమిదో టి- 20కు సెలెక్ట్ అయ్యారు. ఆ పోటీల్లో పాల్గొనేందుకు తీవ్ర ఆర్థిక కష్టాలు ఉన్న దృష్ట్యా తమకు ఆర్ధిక సహాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఆమె ప్రతిభకు ఆర్ధిక కష్టాలు కారణం కాకూడదని తన వంతుగా రూ. 10 వేల చెక్కును తన క్యాంపు కార్యాలయంలో వారికి అందజేశారు.