దేవస్థానాల్లో ఎమ్మెల్యే మాధవి ప్రత్యేక పూజలు

గుంటూరు, మహానాడు: దసర ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రంను పురస్కరించుకొని బుధవారం గుంటూరులోని శారదాంబ పీఠం, కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం, శ్రీ శారద పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, పట్నంబజార్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాల్లో అమ్మవారిని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని, రాష్ట్ర ప్రజలు, గుంటూరు ప్రజలు సిరి సంపదలు, సంతోషాలతో తుల తూగాలని, ఆ అమ్మవారిని ప్రార్ధించినట్టు ఎమ్మెల్యే మాధవి తెలిపారు.