సీఎంను కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

హైదరాబాద్, మహానాడు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. హైదరాబాద్ లో సోమవారం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి శుభలేఖను అందించి ఆహ్వానించారు. చంద్రబాబును కలిసిన వారిలో ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.