రక్తదాన శిబిరమును ప్రారంభించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

కందుకూరు పట్టణంలోని శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపం నందు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు.

ఈ సందర్భంగా విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాం. విధి నిర్వహణలో తమ కుటుంబాల సైతం దూరంగా ఉంటూ ప్రజల కోసం పోలీసులు పని చేస్తారని ఎమ్మెల్యే గారు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని గౌరవించడం మన కర్తవ్యంగా ప్రతి పౌరుడు భావించాలని ఎమ్మెల్యే గారు కోరారు..

అన్ని దానాల్లో కన్నా రక్తదానం గొప్పది అన్నారు. రక్త దానం చేయటం వల్ల ఆపదలో ఉన్న మరో ప్రాణాన్ని రక్షించే అవకాశం మనకు లభిస్తుందని తెలిపారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభినందించారు