మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే సౌమ్య

అమరావతి , మహానాడు : 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయదుంధుభి మోగించిన తరుణంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం పల్లగిరిలో వేంచేసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో తంగిరాల సౌమ్య బృందం 202 కొబ్బరికాయలను కొట్టారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే తంరిగాల సౌమ్య అత్యధిక భారీ మెజారిటీ గెలిచిన సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నట్లు ప్రకటంచారు. కాగా, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.  పట్టణ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.