పోలంపల్లి మున్నేరు డ్యాం లాకులు వద్ద తెగిపోయిన ప్రధాన కాల్వ కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

జగ్గయ్యపేట: సాయంత్రం 6 గంటల సమయంలో వర్షంలో సహితం ప్రజానాయకుడు రైతు భాంధవులు జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రాం తాతయ్య పోలంపల్లి మున్నేరు డ్యాం లాకులు వద్ద తెగిపోయిన ప్రధాన కాల్వ కట్టను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. అతి త్వరలో ఈ గండ్లు పూడ్చడానికి తగిన ప్రతి పాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కాల్వకి పోలంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోనే దాదాపు పది గండ్లు పైన పడ్డాయి అవే కాక పాత కరకట్టకి దాదాపు ఐదు గండ్లు పడ్డాయి ఈ గండ్లు వలన వరిపోలాల్లో మట్టి ఇసుక మేటలు పెట్టి వేసిన నాట్లు పూర్తిగా ఇసుక మట్టితో మునిగి పోయాయి అంతే కాక నీట మునిగిన వరి పోలాలు పాచి పోయి రైతులకి తీవ్రంగా నష్ట పోయారు వర్షం సహితం లెక్కచేయని తాతయ్య వీటిని పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారు.

ఈ కార్యక్రమంలో వత్సవాయి మండలం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి రాంబాబు మరియు వివిధ గ్రామాల నాయకులు రైతులు కార్యకర్తలు అధికారులు అభిమానులు పాల్గొన్నారు.