వినుకొండ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. శిబిరానికి హాజరైన రోగులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రజాక్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, మునిసిపల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.