ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ

వినుకొండ, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మార్కాపురం రోడ్డు భ్రమర టౌన్షిప్ వద్ద ఇసుక డంపింగ్ యార్డులో ఫ్రీ ఇసుక పంపిణీని మంగళవారం వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇంటి నిర్మాణాలు చేపడుతున్న పేదలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ ద్వారా భవన నిర్మాణ కార్మిక రంగానికి న్యాయం జరిగిందని, నిర్మాణ రంగానికి పూర్వవైభవం వచ్చిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.