10 కిలోల బరువు తగ్గిన ఎమ్మెల్సీ కవిత..?

తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 4 నెలల్లో 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు నిన్న ఆమెను ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె భర్త సమక్షంలో వైద్య పరీక్షలు పూర్తి కాగా, ఆమె 10 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. టెస్టుల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు. కవితను పరామర్శించేందుకు కేటీఆర్, హరీశ్ రావు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం