ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు: వేద కాలేజ్, కాకతీయ కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఆలపాటి రాజా, పరిశీలకుడు వేములకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఏమన్నారంటే.. జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులు, మేధావులు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ప్రతిభవంతులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయించాలి. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయించాలి. గ్రామస్థాయి నుంచి పార్టీ సభ్యత్వాన్ని బలోపేతం చేయాలి.

ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా మాట్లాడుతూ … వ్యవస్థలన్నింటిని కలుషితం చేసిన వ్యక్తి జగన్.

విద్యావంతులకు ఉద్యోగాలు లేకుండా చేసింది జగన్. రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చిన ఘనత జగన్ ది. కలుషిత మద్యాన్ని వరదలై పారించిన ఘనత జగన్ ది. విద్యా వ్యవస్థల్ని నాశనం చేసిన ఘనత గత ప్రభుత్వానికి చెందుతుంది. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉద్యోగం అవకాశాలు కల్పించలేదు.

కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. అలాగే, ప్రతిభావంతులు, మేధావులు అందరూ కూడా ఓటును నమోదు చేసుకోవాలని, జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పట్టణ, మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.