టీ అమ్ముతూ నెలకు లక్షకు పైగా సంపాదిస్తున్న మోడల్‌

పూణేలో మోడల్‌లా తయారై టీస్టాల్‌ నడుపుతోన్న సిమ్రన్‌.. తన ఆహార్యంతోనే కాదు.. తాను చేసే రుచికరమైన టీతోనూ స్థానికుల్ని ఆకట్టుకుంటోంది. ఇందుకు కారణం.. ఆమె తనదైన స్టైల్‌లో టీ తయారుచేయడమే! కప్పుకి రూ. 10 చొప్పున రోజుకు 300 కప్పులకు పైగా ఛాయ్‌ అమ్ముతున్నారు. తన టీస్టాల్‌ వ్యాపారంతో ప్రస్తుతం నెలకు రూ. 1 లక్షకు పైగానే సంపాదిస్తున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎప్పుడైనా వచ్చి మా స్టాల్‌లో టీ రుచిని ఆస్వాదించమని సిమ్రన్‌ చెబుతున్నారు.