తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం

బండి సంజయ్‌కు మంత్రి పదవి సామాన్యుడికి భరోసా
కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది
ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు అసామాన్యం
ప్రజాసంగ్రామ యాత్రతో కేసీఆర్‌ సర్కార్‌పై ఉద్యమాలు
బండి రాజకీయ జీవిత ప్రస్థానమంతా ఒడిదుడుకులే
ఎమ్మెల్యేగా ఓడిరచినా వీడని హిందుత్వ వాదం
నమ్మిన సిద్ధాంతం కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం
కార్యకర్తల పిలుపు కోసం పరితపించే అభిమానధనుడు
హిందుత్వ ఐకాన్‌కు కేంద్రమంత్రి పదవిపై సంబరాలు
కార్యకర్తల్లో ఉప్పొంగుతున్న ఉత్సాహం

హైదరాబాద్‌: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు కేంద్ర మంత్రి పదవిపై తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండాపోయాయి. సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తున్నారు. పార్టీలో కార్యకర్తగా చేరింది మొదలు ఏ పదవి లో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడమే లక్ష్యంగా పనిచేసిన బండి సంజయ్‌కు అమాత్య పదవి లభించడంపై కరీంనగర్‌ పార్లమెంట్‌ ప్రజల్లోనూ సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.

మారుమూల పల్లెల్లోనూ కాషాయ జెండా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పట్టణాలకే పరిమితమైన బీజేపీ ని మారుమూల పల్లెల్లోకి విస్తరింపజేయడంలో బండి సంజయ్‌ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రజాసంగ్రామ యాత్రతో 16 వంద ల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచా రని, కేసీఆర్‌ పాలన అంతానికి పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీ య విశ్లేషకుల అభిప్రాయం. ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరసనలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్‌ సర్కార్‌పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో బీజేపీ రాష్ట్ర రథసా రథిగా కార్యకర్తలను ఏకోన్ముఖులను చేసి రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళల సమస్యలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై అడుగడుగున పోరాటాలు చేశారు. బీజేపీని ఇంటింటికీ పరిచయం చేశారు. గత ఐదేళ్ల పాటు కుటుంబానికి కూడా దూరమయ్యారు.

ప్రజా సమస్యలపై ఎంతకైనా తెగించే తత్వం

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా తెగించే మనస్త త్వం బండి సంజయ్‌ సొంతం. నిరంతరం ప్రజల్లో ఉండటం… నిత్యం కార్యకర ్తలతో కలిసి నడవడం ఆయన ప్రత్యేకత. ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ లాఠీచార్జ్‌లు, కేసులు, అరెస్టులకు లెక్క చేయని చరిత్ర. రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళుతుంటే నాటి అధికార పార్టీ మూకలు రాళ్ల దాడికి తెగబడినా వెనుకంజ వేయకుండా ధీటుగా ఎదుర్కొని రైతులకు అండగా నిలిచిన ధీశాలి. రైతుల పక్షాన అనేక దీక్షలు చేపట్టారు. నిరుద్యోగ మార్చ్‌ పేరుతో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టి వారి కోసం పోరాడారు. ఈ పోరాటాలతో బెంబేలెత్తిన నాటి కేసీఅర్‌ సర్కార్‌ టెన్త్‌ హిందీ పేపర్‌ లీకేజీ కేసులో అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్టు కూడా చేయించారు. అయినా వెనుకంజ వేయకుండా ఉద్యమించారు. 317 జీవోను సవరించాలని ఉద్యోగుల పక్షాన పోరాడి సర్కార్‌ను గడగడలాడిరచారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాల యంలో దీక్ష చేస్తుండగా పోలీసులను పంపి గ్యాస్‌ కట్టర్లతో ఆఫీస్‌ గేట్లను ధ్వంసం చేయించి అరెస్ట్‌ చేసి బీజేపీని కట్టడి చేయాలని చూశారు. అయినా వెరవని సంజయ్‌ కేసీఅర్‌ సర్కార్‌పై అలుపెరగని పోరాటాలు చేసి నాటి ప్రభు త్వ పతనంలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు.

నమ్మిన సిద్ధాంతాన్ని వీడని ధీశాలి

కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు కూడా వెళ్లారు. ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి భారతదేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ కూడా బండి సంజయ్‌ మాత్రమే కావడం గమనార్హం. అట్లాంటి వ్యక్తికి మోదీ కేబినెట్‌లో చోటు దక్కడంతో కార్యకర్తల భావోద్వేగంతో ఉప్పొంగిపోతున్నారు. నిజానికి బండి సంజయ్‌ రాజకీయ జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన రాజకీయ జీవితమంతా ఆటుపోట్లమయమే. కరీంనగర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్‌ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగారు. రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలిచిన బండి సంజ య్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్‌ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతంలో గంప గుత్తగా వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడూ హిందుత్వ భావజాలాన్ని వీడలేదు. ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తను నమ్మిన సిద్దాంతాన్ని ఏనా డూ పక్కన పెట్టలేదు. ఎన్ని అవమానాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగారు. అందుకే కార్యకర్తలకు ఆయన ‘హిందుత్వ ఐకాన్‌’గా మారారు.

అధ్యక్ష పదవి నుంచి తొలగింపు..కార్యకర్తల్లో పెల్లుబుకిన నిరసనలు

2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 89 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన బండి సంజయ్‌ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్య మాలు చేస్తూ బీజేపీపీ రాష్ట్రవాప్తంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ను అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం రాష్ట్రంలో పెను సంచలనమైంది. ముఖ్యంగా కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. బండి సంజయ్‌ రాష్ట్ర అధ్య క్షుడిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారి బీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకెళ్లారు. అయితే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించి న స్థాయిలో సీట్లను సాధించలేకపోయిందని సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానించా రంటే సంజయ్‌ పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత పదవిని కట్టబెట్టినప్పటికీ కార్యకర్తల్లో అసంతృప్తి తగ్గలేదు. అందుకే కేంద్ర మంత్రి పదవి దక్కగానే బీజేపీలో కష్టపడే కార్యకర్తలంతా తమకు దక్కిన గౌర వంగా సంబరా లు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే బండి సంజయ్‌కు కేంద్రంలో ఏ శాఖ అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటు ఆ శాఖ ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. ముఖ్యం గా తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృ ద్ధిపై దృష్టిసారిస్తారన్న నమ్మకం తమకుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.