-కాంగ్రెస్ హయాంలోనే రామమందిరం తెరిచింది
-రామరాజ్యం స్ఫూర్తిగా రాజీవ్‌గాంధీ పాలన
-ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్, మహానాడు: గాంధీభవన్‌లో శనివారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను గౌరవించాల్సిన ప్రధాని మోడీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం దురదృష్టకరం. దేశంలో ప్రార్థన మందిరాలను కాపాడుకునే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్ లల్లా మీద బుల్డోజర్ తీసుకువస్తారని ప్రచారం చేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే రామ్ లల్లా దర్శనం కోసం గేట్లు తెరిచారని గుర్తుపెట్టుకోవాలి. 1986లో రామ్ లల్లా దర్శనం కోసం గేట్లు తీశారు. రామ మందిరం నిర్మాణం శంకుస్థాపనకు తోడ్పడ్డారు. అప్పుడు నరేంద్ర మోదీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. మత సామరస్యాన్ని గౌరవిస్తున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. 1989లో రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం అయోధ్య నుంచే ప్రారంభించారు. 1986లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిర నిర్మాణం రెండు దశాబ్దాల ముందే జరిగేది. ఇంత పెద్ద వివాదం జరిగేది కాదు. రామాయణ, మహాభారతాలను దూరదర్శన్‌లో టెలికాస్ట్ చేసింది రాజీవ్ ప్రధాని గా ఉన్నప్పుడే అన్న విషయం తెలుసుకోవాలని హితవుపలికారు. రామ మందిర శంకుస్థాపనలో బీర్ బహదూర్ సింగ్ కేంద్ర హోంమంత్రిగా పాల్గొన్నారు. శ్రీరా ముడిని పూజించడం హైందవ సంప్రదాయం. రామరాజ్యం స్ఫూర్తిగా రాజీవ్ గాంధీ పరిపాలన చేశారు. హిందూ సంప్రదాయాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.