ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్‌చరణ్‌ మారీ

హాజరైన ప్రధాని మోదీ, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు
ఆహ్వానాన్ని మన్నించి పాల్గొన్న ప్రతిపక్ష నేత నవీన్‌పట్నాయక్‌

భువనేశ్వర్‌: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత మోహన్‌ చరణ్‌ మారీ బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాల్సిందిగా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ను బుధవారం ఉదయం స్వయంగా నవీన్‌ ఇంటికి వెళ్లి మరీ మోహన్‌చరణ్‌మారీ ఆహ్వానిం చారు. ఆహ్వానాన్ని మన్నించి నవీన్‌ పట్నాయక్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యా రు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 78 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. బిజుజనతాదల్‌ 51 సీట్లతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది.