గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం : ప్రజల అసౌకర్యాన్ని గుర్తించి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో బిబి.గూడెం – తోటపల్లి రోడ్డు కి మోక్షం లభించింది.ఈ రోడ్డు పై ప్రయాణించెందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ రహదారి కాంట్రాక్టర్ తో మాట్లాడి రూ.20 లక్షల వ్యయం తో ఈ రహదారి కి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కోరారు. శుక్రవారం ఉదయం మరమత్తు పనులకు ఎంఎల్ఏ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గతంలో రూ.29 కోట్లు ఈ రోడ్డు నిర్మాణానికి మంజూరు అయ్యాయని అన్నారు . బిబి గూడెం ఫ్లై ఓవర్ నుండి తోటపల్లి వరకు 9 .4 కిమీ మేర ఆర్అండ్ బి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందనీ చెప్పారు .కొంత మేర పనులు చేసినప్పటికీ కాంట్రాక్టర్ యలమంచిలి వెంకటరత్నం కు వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. దింతో ఆయన పనులు ఆపేసారని చెప్పారు. ప్రజల ఇబ్బందుల్ని గుర్తించిన తాను కాంట్రాక్టర్ తో చర్చలు జరిపి నిధులు మంజూరు చేయిస్తానని స్పష్టమైన హామీ ఇవ్వటంతో తనపై నమ్మకం ఉంచి రోడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చారని అన్నారు.
ఈ రోడ్డు లో రెండు కిలోమీటర్లు నూజివీడు పరిధిలో ఉంటుందని, మిగతా 7 కిలోమీటర్లు గన్నవరం నియోజకవర్గ పరిధికి వస్తుందన్నారు. తనపై. నమ్మకం తో రూ.20 లక్షల వ్యయంతో ప్రస్తుతం రోడ్డు మరమత్తులు చేసేందుకు కాంట్రాక్టర్ యలమంచిలి వెంకటరత్నం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రాబోయే కాలంలో నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేసారు. రోడ్ల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు.