అమరావతి: మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే తన కార్యకర్తలు, అభిమానులు, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈ నెల తొమ్మిదోతేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మోపిదేవి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు.