సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణం
మోదీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలే
జీవితంలో ఫోకస్ గా పనిచేయండి
వరూ ఎవరికంటే తక్కువ కాదు
జేఎన్టీయూలో స్థూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరించుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చు. సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణంగా మారింది. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలను నివారించవచ్చు. కుటుంబ వ్యవస్థ విచిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలను కారణం.
చిన్నారుల మానసిక దృఢత్వానికి ఉమ్మడి కుటుంబం తోడ్పడుతుంది. పిల్లలను మానసికంగా సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పిల్లలకు సోషల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ నేర్పించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.స్కూల్స్,కాలేజెస్ లో సబ్జెక్ట్ నేర్పించడమే కాదు… మోరల్ పోలీసింగ్ కూడా నేర్పించాలి.
పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలని నిర్వాహకులకు సూచించాం. స్కూళ్లు, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అవసరం ఎంతో ఉంది.. పోలీసులకు సమాచారం చేరవేసేలా వ్యవస్థను తయారు చేసుకుంటే.. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చవచ్చు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసింది.
డ్రగ్స్ పై ప్రభుత్వం యుద్ధమే ప్రకటించింది. మీ అన్నగా పిలుపునిస్తున్నా… డ్రగ్స్ నిర్మూలనకు సహకరించండి. ఉద్యమాల గడ్డ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. అన్ని ఇంటర్ , డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మోరల్ పోలీసింగ్ తో అన్ని రకాల సమస్యలను పరిష్కరించొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్ లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత. ప్రజా సమస్యలపై ఫోకస్ గా పనిచేయడం వల్లే నేను ఈ స్థాయికి చేరా. సమస్యలకు భయపడి పారిపోవద్దు.నిలబడి సమస్యలపై పోరాడాలి. జీవితంలో ఫోకస్ గా పనిచేయండి.. లక్ష్యాలను సాధిస్తారు.
నరేంద్రమోదీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలే. రోజుకు 16గంటలు మీరు ఎంత ఫోకస్ గా పని చేస్తారో… అది మీ లక్ష్యాన్ని అంత చేరువ చేస్తుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది.మన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది. గొప్ప వ్యక్తులు ఎవరూ గొప్ప కుటుంబాల నుంచి రాలేదు. ఎవరూ ఎవరికంటే తక్కువ కాదు