– కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉంది
– మాజీ మంత్రి పీతల సుజాత
మంగళగిరి, మహానాడు: వైసీపీ పాలనలో 2,04,414 నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు జరిగాయని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు.
ఇక్కడి తెలగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహిళల వ్యక్తిత్వం హననం చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టిన, పెడుతున్న జగన్ ముఠాని వదిలిపెట్టేదిలేదు. వైసీపీ పాపాల పుట్ట బద్దలైంది. ఒక్కొక్క పాము ఆ పుట్టలోంచి బయటికి వస్తోంది. చిన్న చేపల వెనుక ఉన్న పెద్ద తిమింగలాలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి సుజాత మండిపడ్డారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. వర్రా రవీంద్ర రెడ్డి వైసీపీ సైకో. ఇలాంటివారు ఇంకా చాలా మంది ఉన్నారు. వర్రా రవీంద్ర రెడ్డి వెనుక ఎవరున్నారో తెలియాలి. వర్రా రవీంద్రరెడ్డికి శాలరీ ఎక్కడి నుంచి వచ్చేదో సమగ్ర వివరాలు సేకరిస్తాం. తప్పక విచారణ జరిపిస్తాం. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న పెద్ద తిమింగలాలను వదిలిపెట్టేది లేదు. జగన్ పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాల సంఖ్య 25 శాతానికి తగ్గాయి. రాబోయే రోజుల్లో నేరాల సంఖ్య తగ్గించడమే చంద్రబాబు లక్ష్యం. వైసీపీ నాయకులకు కౌంట్ డౌన్ మొదలైంది.
వైసీపీ ఆగడాలు ఇక సాగవు. తప్పు చేసినవారు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరే బయటికి తెస్తాం, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు వైసీపీ ప్రభత్వంలో విచ్చలవిడిగా వదిలిన గంజాయి, డ్రగ్సే కారణం. ఈ పాపం వైసీపీదే. కూటమి పాలనలో ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే వారికి శిక్ష తప్పదు. వైసీపీ హయాంలో అన్యాయాలకు గురైనవారి కటుంబాలను ఆదుకున్న దాఖలాలు లేవు. రాజమహేంద్రవరంలో 16 ఏళ్ల దళిత బలికపై కొంతమంది నాలుగు రోజులపాటు అత్యాచారానికి పాల్పడి పోలీసు స్టేషన్ ఎదుట పడేసి వెళ్తే కేసులు లేవు. వైసీపీ హయాంలో ఒకటి, రెండు అత్యాచారాలకే ఏదో జరిగిపోయినట్లు టీడీపీ వారు గగ్గోలు పెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడడం సబబు కాదు.
వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా సరఫరా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక సిట్ వేశాం. చాలా స్ట్రిట్ గా ఈ సిట్ పనిచేస్తోంది. జగన్ తన తల్లి, చెల్లిని దారుణంగా ట్రోల్ చేసినా జగన్ స్పందించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్నాం. వైసీపీ నాయకులు అసభ్యకరమైన పోస్టులు పెట్టి, మార్ఫింగ్ లు చేసి మహిళల్ని అనేక విధాలుగా అవమానించారు. మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. వారినెవరినీ వదలిపెట్టేది లేదు, ఎవర్నీ ఉపేక్షించేదిలేదు. అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తప్పక కఠిన చర్యలు ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లా అండ్ ఆర్డర్ ని స్ట్రీమ్ లైన్ లో పెట్టి ముందుకు వెళ్తున్నారు. నేడు వైసీపీ నాయకులు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు.
వైసీపీ హయాంలో మహిళలపై అనేక దారుణాలు, అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు జరిగాయి. వైసీపీ నాయకులు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నోటికొచ్చింది మాట్లాడటం, నోటికొచ్చింది రాయటమే వైసీపీ భావప్రకటన స్వేచ్ఛ అనుకుంటోంది. వైసీపీ నాయకులు అనుకున్నది ఇతరులపై రుద్దడం సరికాదు. టీడీపీ నాయకులంతా సత్ సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చినవారే. టీడీపీలో ఉన్న నాయకులంతా విద్యావంతులే. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో వారున్నారు. పార్టీ విధి విధానాల ప్రకారం నడుచుకుంటాం. టీడీపీ నాయకుల గుణగణాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు.
వైసీపీ నాయకులు ఐదేళ్లపాటు కాలకేయుల్లా ప్రవర్తించారు. మహిళల్ని ఇంతటి దారుణంగా అవమానించే హక్కు వైసీపీ నాయకులకు ఎవరిచ్చారు? ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాలను బలోపేతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, టీడీపీ మహిళలు, రాష్ట్రంలోని మహిళలపై చాలా దారుణంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. వారిని చట్టపరంగా శిక్షిస్తాం. జగన్ అబద్దాలు మాట్లాడటం కాదు, సాక్ష్యాధారాలతో బయట పెడితే… యాక్షన్ తీసుకుంటాం. వైసీపీ హయాంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున రమ్య అనే మహిళను దారుణంగా చంపేశారు. అది చీకటి రోజు. ఆమె దివ్యాంగురాలు అని కూడా చూడలేదు. మిస్బా అనే మైనార్టీ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా చేశారు.
మైదుకూరులో ఓ బీసీ మహిళను అత్యాచారం చేసి చంపారు. అంతర్జాతీయ దినోత్సవం రోజున ఒక విదేశీ మహిళపై అత్యాచారం చేశారు. ఒంగోలులో ఓ దివ్యాంగురాలిని సజీవ దహనం చేశారు. రమ్యని కత్తితో చంపారు. పల్నాడు జిల్లా శివాపురంలో ఓ ఎస్టీ మహిళని ట్రాక్టర్ తో తొక్కించి చంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఘోరాలు చాంతాడంత అవుతాయి. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉంది.