• వైసీపీ పాలనలో అక్రమంగా సస్పెండ్ చేశారంటూ పోలీసుల కన్నీరు
• 2023 పోలీస్ రిక్యూర్మెంట్ లో తప్పుడు మార్కుల వలన ఆగిన నియామకాలను కొనసాగించాలని వినతి
• భూ కబ్జాలు, చోరీలు, బెదిరింపులపై మంగళగిరికి తండోప తండాలుగా తరలివచ్చిన అర్జీదారులు
అమరావతి, మహానాడు: ప్రజా తీర్పుతో వైసీపీ ప్రభుత్వం కూలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ పాలనలో జరిగిన ఘోరాలు ఒక్కొక్కొటీ బయటపడుతున్నాయి. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా వినతుల కార్యక్రమంలో వైసీపీ నేతల అరాచకాలు రట్టు అవుతున్నాయి. ఆ వివరాలివి.
టీడీపీ అభిమాని కావడంతో తెలుగుదేశం ప్రచార కార్యక్రమాలకు శ్రేణులను తీసుకెళ్లినందుకు తన తండ్రిని అతికిరాతంగా చంపి… అక్రమ కేసుల్లో తనను ఇరికించి రెండు నెలలు జైల్లో ఉంచారని.. బతుకు దెరువు కోసం తన భర్త విదేశాలకు వెళ్లాడని.. తనకు దిక్కు ఎవరు లేరని.. తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులు కోరుకొండ రమణలకు భయపడి తాము హైదరాబాద్ కు వెళ్లి తలదాచుకుంటున్నామని.. తమ తండ్రిని చంపిన వారిని శిక్షించి తనపై మోపబడిన అక్రమ కేసులను తొలగించాలని కోనసీమ జిల్లా రాయవరం మండలంకు చెందిన సునా ఫాతిమా మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలకు వినతిని అందించి న్యాయం చేయాలంటూ కన్నీళ్ళపర్యంతమయ్యారు. తన తండ్రిని దారుణంగా చంపిన ఫోటోలను చూపిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు.
• కడప జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లె గ్రామానికి చెందిన రామన్న విజ్ఞప్తి చేస్తూ.. వైసీపీ నేత రవికుమార్ రెడ్డి తన భూమిని అక్రమించుకొని తనను తన భూమిలోకి రానివ్వడంలేదని, దయ ఉంచి తన భూమిని ఆక్రమణ నుండి విడిపించాలని రామన్న గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.
• నంద్యాల మండలం కానకాల గ్రామ పంచాయతీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి అనుచరులు తమ భూమిని అక్రమించుకుని భూమిలోకి వెళ్లకుండా దౌర్జనం చేస్తున్నారని అల్లూరు షభాన వాపోయారు.. తమ భూమిన వైసీపీ నేతల ఆక్రమణ నుండి విడిపించాలని విజ్ఞప్తి చేశారు.
• కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లిలో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని… అది దొంగతనం కోసం జరిగిన హత్య కాదని.. పూర్తి విచారణ చేపట్టి నిజాలు తేల్చాలని వృద్ధురాలి బందువులు నేడు గ్రీవెన్స్ లో వినతిని అందించారు.
• ప్రకాశం జిల్లా కొత్త పట్నం మండలం మోటుమాల గ్రామానికి చెందిన రేవూరి అబ్రహాం విజ్ఞప్తి చేస్తూ… తాను టీడీపీ కోసం పనిచేస్తుండటంతో తనపై వైసీపీ నాయకుడు తలారి చరణ్ అక్రమ కేసులు పెట్టాడని. అంతేకాకుండా సోషల్ మీడియాలో నిరాధారమైన పోస్టులతో వేధిస్తున్నాడని.. ఈ విషయంపై కొత్తప్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
• తన బంధువులతో టీడీపీకి ఓట్లు వేయించినందుకు రాత్రికి రాత్రే తన భూమిలో వైసీపీ నేతలు ఇళ్లు కట్టారని… తహశీల్దార్ కు ఫిర్యాదు చేయడంతో తొలగించిన ఇళ్లు… మళ్లీ కట్టి తనను ఇబ్బంది పెడుతున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మోటుమాల గ్రానికి చెందిన పురిణి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
• గత ప్రభుత్వంలో అన్యాయంగా తమను విధుల నుండి తొలగింపులకు గురైన హోంగార్డులు మంగళగిరి టీడీపీ కార్యాలయానికి పెద్దఎత్తున వచ్చి హోంమంత్రికి విన్నవించారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు.
• పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అనుచరులు తమ భూమిని ఆక్రమించుకున్నారని… వీధి రౌడీలతో దాడి చేయించారని దీనిపై ముదివేడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కురబలకోట మండలం అంగళ్లు గ్రామం మజరా ఎర్రజనివారిపల్లో ఉండే నల్లతాత గారి వెంకటరమణారెడ్డి నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబు పేట గ్రామంలో 360 ఎకరాల ప్రభుత్వ సొసైటీ చెరువులో అక్రమంగా చేపలను పెంచుతూ… ప్రశ్నిస్తే వైసీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారంటూ నవాబు పేట గ్రామస్తులు పలువురు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• ఆర్మీ సోల్జర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి వెళితే తమపై దాడి చేశారని… అంతే కాకుండా తమపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని.. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామానికి చెందిన పలివెల విజయలక్ష్మి వాపోయారు
• ఏపీలోని అన్ని జిల్లాలలో జాతీయ దివ్యాంగుల హక్ల చట్టం 2016 ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ లో ర్యాంపులు, దివ్యాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ 92 లను అమలు పరచాలని షేక్ కాలేషా విజ్ఞప్తి చేశాడు. అలాగే 2014 – 2019 లో ఇచ్చిన టిడ్కో ఇళ్లను పొందిన దివ్యాంగులకు వారి కుటుంబ సభ్యులకు రుణాలను మాఫీ చేయాలని కోరారు.
• గుంటూరు పరిధిలో గిరిజనులకు ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పదోన్నతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వలన అన్యాయం జరుగుతుందని అంతే కాకుండా ఖాళీలు లేకుండా(Roster points) సీఐ, ఎస్సైలుగా పనిచేస్తున్నారని వీటిపై సమగ్ర విచారణ జరిపి సర్వీసు పరంగా నష్టపోయిన ఎస్టీ క్యాటగిరీ పోలీసులకు న్యాయం చేయాలని గ్రీవెన్స్ లో వినతి అందించారు.
• ఏపీ ప్రభుత్వం మహిళలకోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయానణం ఏర్పాటు చేస్తున్నందున ఏలూరు – ద్వారకా తిరుమల రూట్ లో రద్దుచేసిన ఆర్టీసీ బస్సులను తిరిగి పునరుద్ధరించాలని ఆ ప్రాంత గ్రామాల నుండి వచ్చిన ప్రజలు నేడు గ్రీవెన్స్ లో వినతిని అందించారు.
• ఉర్థూ మీడియం స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు ఇప్పటి వరకు లిమిటెడ్ రిక్రూట్ మెంట్ పెట్టలేదని.. ఇప్పుడు లిమిటెడ్ పెట్టడం వలన డీఎస్సీ 2018 లో క్వాలిఫైడ్ అయిన మెరిట్ అభ్యర్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని.. 2018 లో మైనర్ మీడియా ఉర్థూ బ్యాకలాగ్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండింట్ పోస్టులను స్పెషల్ కేసు కింద పరిగణించి పస్ట్, సెకండ్ ర్యాంకులను సాధించి క్వాలిఫైడ్ అయిన తమకు రూల్ రిలాక్సేషన్ లేదా స్పెషల్ కేసుగా కన్సిడర్ చేయాలని వారు అభ్యర్థించారు.
ఉద్యోగం పేరుతో డబ్బులు దండుకుని మోసం చేశారంటూ పలువురు ఫిర్యాదు చేయగా… తాము అర్హులమైనా తమకు గత ప్రభుత్వంలో ఇంటి స్థలం మంజరు చేయలేదని పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన రాజేశ్వరి వాపోయారు. తమకు రావాల్సిన ఆస్తులను తమ సోదరులు వైసీపీ నాయకుల అండతో కొట్టేయాలని తాము తమ తల్లిదండ్రులకే పుట్టలేదని దొంగ సర్టిఫికేట్లు పుట్టించారని నంద్యాల జిల్లాకు చెందిన ఆవుల నాగమణి, ఆవుల భారతి, ఆవుల నాగేశ్వరిలు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
ట్రిపుల్ తలాఖ్ పేరుతో తన భర్త తనకు దూరంగా ఉంటున్నాడని.. దూరంగా ఉండటంతో భరణం కింద డబ్బులు కట్టాలని కోర్టు ఆదేశించినా.. పట్టించుకోకుండా తనను తనపిల్లలను తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని మంగళిరికి చెందిన షేక్ షబానా హోంమంత్రి ముందు కన్నీళ్ళపర్యంతమైంది.
వైసీపీ కోసం తొత్తులగా పనిచేసిన పోలీసులు పెట్టిన అక్రమ కేసులుపై మరికొందరు ఫిర్యాదు చేయగా.. భూ సరిహద్దు తగాదాలపై కొందరు. దొంగిలించిన సొమ్ములను రికవరీ చేయాలంటూ మరికొందరు.. చేసిన పనులకు బిల్లు రాలేదని పలువురు.. వైసీపీ పాలనలో అన్యాయానికి గురైన ఉద్యోగులు ఇలా వందల సంఖ్యలో అర్జీదారులు నేడు తమ వినతులను టీడీపీ కార్యాలయంలో అందించి న్యాయం చేయాలని అర్థించారు.