ప్రభాస్ దేశంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే దేశం మొత్తం హడావిడే. మూవీ ఎలా ఉండబోతోందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన, డార్లింగ్ ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇవ్వకపోయిన అతని సినిమాలకి మొదటి రోజే రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ నుంచి ఏ ఒక్క హీరో కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా డార్లింగ్ ప్రభాస్ దరిదాపుల్లో లేరు. సినిమా, సినిమాకి అతని రేంజ్ పెరిగిపోతోంది. కల్కి సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రభాస్ తన స్టామినాని మరోసారి చూపించాడు. ఈ మూవీ ఇప్పటికే 1100 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. 30 రోజుల తర్వాత కూడా కల్కి సినిమాకి థియేటర్స్ లో డీసెంట్ వసూళ్లు లభిస్తూ ఉండటం విశేషం. డార్లింగ్ ప్రభాస్ నుంచి రాబోయే నెక్స్ ట్ సినిమాలపై కూడా హై లెవల్ లో బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో మోస్ట్ వైలెంట్ మూవీగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. రణబీర్ కపూర్ తో యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా నుంచి రాబోయే సినిమా స్పిరిట్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో బిటౌన్ కూడా స్పిరిట్ సినిమాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ సినిమాతో సందీప్ రెడ్డి ఎలాంటి కథని చెప్పబోతున్నాడు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. స్పిరిట్ చిత్రంలో డార్లింగ్ ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారంట. ఓ క్యారెక్టర్ లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడంట . అలాగే మరో క్యారెక్టర్ లో మోస్ట్ వైలెంట్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడంట. డార్లింగ్ సక్సెస్ ఫార్ములా ఈ రెండు పాత్రల మధ్య ఫైట్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందంట.