Mahanaadu-Logo-PNG-Large

పల్నాడులో కూటమికే ఎంపీ, ఏడు ఎమ్మెల్యే స్థానాలు

జూన్‌ 4న ప్రజాతీర్పుతో వైసీపీ నేతలకు కనువిప్పు
జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌

నరసరావుపేట, మహానాడు : పార్లమెంట్‌ స్థానంతో పాటు పల్నాడు జిల్లాలోని ఏడు ఎమ్మెల్యే స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని, రాష్ట్రంలో కూటమి అధికారం చేపడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ తెలిపారు. నరసరావుపేట టీడీపీ కార్యా లయంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమికి ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేశారని, దీన్ని ఓర్చుకోలేక వైసీపీ మూకలు అరాచ కాలు సృష్టించారని మండిపడ్డారు. జూన్‌ 4న ప్రజాతీర్పుతో ఆ పార్టీ నేతలకు కనువిప్పు కలుగుతుందని వ్యాఖ్యానించారు. కూటమి వచ్చాక ఎన్నికల్లో చెలరేగి న రౌడీయిజాన్ని అణిచి వేస్తామన్నారు. కూటమి సారథ్యంలో బీజేపీ సహకారం తో ప్రజా సంక్షేమం, సమాజాభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడిరచారు.