ముమ్మిడివరం: లంక ఆఫ్ ఠానేలంక పంచాయతీ కునాలంక గ్రామంలో వరద పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చిబాబు మాట్లాడుతూ లంక గ్రామాలకు రీవిట్మెంట్ శాంక్షన్ తీసుకువచ్చి రక్షణ చర్యలు చేపడతామని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో లంక గ్రామాల్లో పర్యటించినప్పుడు పది రోజుల్లో రీవిట్ మెంట్ పనులు చేపడతామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. రెవెన్యూ, హెల్త్ ,ఎన్ డి ఆర్ ఎఫ్, బృందాలు వరద సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి విపత్తుల నిధుల నుండి లంక గ్రామాలు ముంపుని కాపాడుతామని అన్నారు.