హైదరాబాద్, మార్చి 11 : ఈ నెల 15వ తేదీన బాపట్లలో జరగనున్న తన కుమారుడు నామ భవ్య తేజ – శేష మనోఙ్ఞ జ్యోతి వివాహ మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి కుమారుడి వివాహ పత్రికను అందజేసి, ఆహ్వానించారు.