ఝార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ

ఝార్ఖండ్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక‌య్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ కె.రవికుమార్‌ ప్ర‌క‌టించారు. స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన క‌లిగించేందుకు మ‌హీ తోడ్పాటు అందిస్తార‌ని, ఎన్నికల ప్రచారంలో తన ఫొటోను వాడుకునేందుకు కూడా ఎంఎస్‌డీ అంగీక‌రించినట్లు ఈసీ వెల్ల‌డించింది.