ఫుడ్ స్టాక్ పాయింట్‌గా మున్సిపల్ స్టేడియం

– స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఆహారం సరఫరా

విజయవాడ, మహానాడు: వరద బాధితుల కోసం వచ్చే ఆహారం, తదితర సరుకులు నిల్వ చేసేందుకు ఐజీఎంసీ స్టేడియాన్ని వినియోగిస్తున్నారు. ఆర్డర్‌ మేరకు ఇక్కడ నుంచి సరుకులను ఆయా ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా తరలిస్తున్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చిట్ట చివరి ప్రాంతంలోని చివరి వ్యక్తి వరకు ఆహారం అందించేందుకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ప్రతి డివిజన్‌, ప్రతీ వీధిలో, చిట్ట చివరి ఇంటి వరకు ఆహారం అందేలా స్పెషల్ ఆఫీసర్ వైస్ చైర్మన్, శాప్‌ ఎండి పి.ఎస్ గిరీషా పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

10 లక్షల ఆహార ప్యాకెట్లు, నాలుగున్నర లక్షలకుపైగా మిల్క్ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిల్స్, 25 వేలకు పైగా బిస్కెట్లతో పాటు అరటి, బత్తాయి వంటి పండ్లు పంపిణీ చేశారు. నగర పరిధిలో ప్రతి ఒక్కరికి ఆహారం అందేలా విజయవాడ నగరపాలక సిబ్బందిని, సెక్రటరీలను, వాలంటీర్ల ద్వారా ప్రతి వార్డులో ఉన్న ప్రతి కుటుంబానికి పంపిణీ చేస్తున్నారు. ఆహార పంపిణీకి వెళ్లే వ్యాన్లలో ఆక్టోపస్, గ్రే హ్యాండ్స్ బందోబస్తు పెట్టారు.