విశాఖలో కార్పెంటర్ రాము హత్య!

– పక్కా స్కేచ్‌తో హతమార్చిన స్నేహితులు
– నలుగురు నిందితుల అరెస్టు
– వెల్లడించిన వన్ టౌన్ పోలీసులు

విశాఖపట్నం, మహానాడు: నగరంలోని వన్ టౌన్ లో కార్పెంటర్‌ భరణిక రాము(35) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు సినిమా తరహాలో వేటాడి హతమార్చారు. వినాయకుడి ఊరేగింపులో పక్కా స్కేచ్‌తో అంతమొందించారు. పోలీసులు నిందితులు నలుగురిని బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు అందించిన వివరాలివి. బాపూజీ కొండ, రంగరీజువీధి ప్రాంతానికి చెందిన భరణికా రాము వడ్రంగి పనులు చేస్తూ జీవనం కేవలం సాగిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు. రాజేష్ అనే వ్యక్తి రాముతో కలిసి కార్పెంటర్ పనులు చేస్తుంటాడు. రాజేష్ రాము వారి వ్యాపారంలో తరచూ గొడవలు పడుతూ తరచూ ఒకరినొకరు దూషించుకునేవారు.

ఈ తరుణంలో మామ కుంచయ్య కారణంగా రాము సోదరి చనిపోవడంతో, ఆమె భర్త, కుంచయ్యలతో కూడా రాముకి గొడవలు జరిగాయి. వారం రోజుల క్రితం రాము కొత్త రోడ్డులోని దీప్తి రెస్టారెంట్ బార్‌లో మద్యం సేవిస్తుండగా, రాజేష్ స్నేహితుడు సతీష్ అక్కడికి వచ్చి గొడవపడి అతని తలపై బీరు బాటిల్‌తో కొట్టాడు. దీంతో రాముకి గాయాలయ్యాయి కాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. తర్వాత రాము… సతీష్‌ ఇంటికి వెళ్ళి గొడవ పడ్డాడు. ఇదిలావుండగా, కుంచయ్య, సతీష్, రాజేష్‌లు సన్నిహితంగా మెలిగేవారని, ఇది గమనించిన రాము… తనకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారని భావించి తన తనతో చెప్పినట్టు ఫిర్యాదులో రాము భరణికా మహేశ్వరి యోచన దేవి పేర్కొంది. దీనికి సంబంధించి ఈ నెల 16న సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కుంచయ్య తన భర్తను గణేష్ విగ్రహాల నిమజ్జనానికి వెళ్ళాలని పిలిస్తే వెళ్ళారని, అదే రోజు అర్ధరాత్రి దాటినా భర్త రాకపోవడంతో, రాము సెల్ ఫోన్ కి కాల్ చేయగా గాయాలతో భర్త కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని వెంటనే కేజీహెచ్‌కు ఆమె వెళ్ళింది.

రాము, కుంచయ్య బైక్‌పై అఫీషియల్‌ కాలనీ ఫస్ట్‌లైన్‌కు వెళ్ళగా రాజేష్, సతీష్, అప్పన్న మరో బైక్‌పై వెళ్ళారు. రాజేష్, సతీష్ కత్తులు తీసి రాము మెడ, ముఖం, శరీరంపై ఇతర భాగాలపై దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన రాముని స్నేహితులు హరి, చిన్ని తదితరులు కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక రాము మృతి చెందాడు. రాజేష్, సతీష్, అప్పన్న, కుంచయ్య పథకం వేసి రాముని హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పై నలుగురిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు