టీటీడీలో ముస్లింలకు స్థానం కల్పించాలి

– రాష్ట్ర అహలేసున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా డిమాండ్‌

కొండపల్లి, మహానాడు: తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలిలో ముస్లిం మైనార్టీలకు స్థానం కల్పించాలని ప్రధానమంత్రి దీనిపై స్పందించాలని రాష్ట్ర అహలేసున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఏమన్నారంటే.. వక్ఫ్ బోర్డు లో హిందువులకు అవకాశం ఉన్నపుడు టీటీడీ లో ముస్లింలకు ఉండకూడదా?

వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళను వివాహమాడిన 700 సంవత్సరాల చరిత్ర వాస్తవమే కదా? మరీ‌ మాకూ అందులో హక్కు ఉంది కదా? ప్రతి సంవత్సరం తిరుపతి దేవస్థానానికి ఉగాది సందర్భంగా రాయలసీమ ప్రాంత ముస్లింలు అధిక శాతం లో వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మను సందర్శించడం వాస్తవం కాదా? బేబీ నాంచారమ్మ విగ్రహం ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లిం మైనార్టీలకు టీటీడీ బోర్డులో మెంబర్లు గా చేయడంలో తప్పేమిటి? దక్షిణ భారత దేశంలో ఉన్న సంప్రదాయాలు ఉత్తర భారత దేశానికి కు భిన్నంగా ఆది నుంచి ఉన్నాయి.

భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ప్రతి అభివృద్ధి లో ముస్లిం ల పాత్ర ఉంది.. మరచిపోకూడదు.. ఇక్కడ హిందూ-ముస్లిం అనే భేదం ఎన్నడు లేదు…. ఎందుకంటే అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరూ షర్ఫుద్దీన్ బాబా ఓవర్ స్వామి దర్గా దర్శించుకోవడం, సంప్రదాయంలో భాగంగా ఇస్లాం సాంప్రదాయ ప్రకారంగా చాదర్ పూలు సమర్పించడం వాస్తవం కాదా? ముస్లిం మైనార్టీలకు మెంబర్లుగా అవకాశం కల్పించాలి.. దీనివల్ల మతసామరస్యం వర్ధిల్లుతుంది. అంతేకాకుండా బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన సయ్యద్ సాబ్ సిద్దయ్య అనుబంధాన్ని ఎవరు మర్చిపోలేని కాబట్టి బ్రహ్మంగారి సేవలో కూడా ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. భద్రాచలం రాములవారికి రాముల వారి కల్యాణానికి హైదరాబాద్ నవాబులు ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ఒక సంప్రదాయంగా పట్టు వస్త్రాలు తలంబ్రాలు రాముల వారి సేవలు చేసింది నిజం కాదా? రాములవారి భక్తుడైన కబీర్ దాస్ చరిత్రను వారి భక్తిని ఎవరైనా మర్చిపోగలుగుతారా? లేదా చరిత్ర నుండి తొలగించే దమ్ము ఎవరికైనా ఉందా?

స్వయానా హిందూ దేవుళ్లే ముస్లిం మైనార్టీ వ్యక్తులను దగ్గర చేర్చుకొని వరాలు కురిపిస్తే వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ముస్లింలను ద్వేషించడం హాస్యాస్పదం కాదంటారా? ఇలాంటి చరిత్ర కలిగిన దేవాలయాల్లో ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పిస్తే చరిత్ర సువర్ణ అక్షరాలతో రాయబడుతుంది. వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్న చాలా వరకు దర్గాలు, పీర్ల పంజాలు,అమలాపురం కొత్తలంక అహమదీ బాబా దర్గా ధర్మకర్తలు హిందువులే. గుంటూరు కాలే మస్తాన్ దర్గా ధర్మకర్తలు హిందువులే.

మచిలీపట్నం ఫరీద్ మస్తాన్ ఔలియా దర్గా కొండపల్లి మస్తాన్ దర్గా…. ఇలాంటివి చాలా హిందువులు ధర్మకర్తలుగా వక్ఫ్ గజిట్లో కూడా హిందువుల పేర్లు ఉండటం వాస్తవం కాదంటారా? దక్షిణ భారతదేశంలో చాలామంది హిందువులు సైతం గాలిబ్ రావు, మస్తాన్ రావు తదితర పేర్లు పెట్టుకుంటున్నారు. ఈ బంధాలు అనుబంధాలు అప్పటికి ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో కొనసాగుతూనే ఉన్నాయి. టీటీడీ బోర్డు దేవస్థానంలో ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించాలని, ఈ సమస్యపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిషా అపాయింట్మెంట్ తీసుకొని త్వరలోనే కలుస్తాం.