– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
గత టిడిపి హయాంలో నందిగామ ను అభివృద్ధి పథంలో నడిపించామని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మంగళవారం నాడు స్థానిక బాబు జగజీవన్ రావు భవనము నందు నందిగామ పురపాలక కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నందిగామ మున్సిపాలిటీ అభివృద్ధి నా లక్ష్యమని పేర్కొన్నారు. దానికి కావలసిన విధంగా మౌలిక వసతులు సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇంటింటికి కులాయి వంటి పనులను గత ఐదేళ్లు వైసీపీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కౌన్సిలర్లు అధికారుల అందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. రెండు దశాబ్దాలు కాలంలో ఎన్నడూ చూడని అకాల వర్షాలు వరదల వలన నియోజకవర్గం అతలాకుతలమైందని అన్నారు. ఆ సమయంలో అధికారులు సమయస్ఫూర్తితో పని చేశారని అభినందించారు. కూటమి
ప్రభుత్వం అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందని అన్ని పనులు కార్యరూపం దాలుస్తున్నాయని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో చిరు వ్యాపారులపై కొరడా జూలిపించిన ఆసీలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసేది దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నందిగామ పట్టణంలో పూర్తిగా అన్ని రోడ్లను సిసి రోడ్లుగా నిర్మాణం చేయటమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.