మాజీ ఎంపీ రాయపాటి
గుంటూరు 22 మహానాడు న్యూస్: ‘అతి తక్కువ సమయంలోనే ప్రజల్లోకి చొచ్చుకుపోగలిగారు. నా సంపూర్ణ మద్దతు మీకే. మీతో పాటు నేనూ ప్రచారానికి వస్తాను, సంపూర్ణ మద్దతు ఇస్తాను.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తో, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. గుంటూరులో నివసిస్తున్న రాయపాటిని డా. పెమ్మసాని శుక్రవారం ఆయన ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంటూరులో పరిష్కారం కాని, పలు సమస్యలపై రాయపాటితో పెమ్మసాని చర్చించారు. అనంతరం రాయపాటి స్పందిస్తూ తమ కుటుంబానికి జిల్లాలో విస్తృత సత్సంబంధాలు ఉన్నాయని, పెమ్మసాని విజయానికి సహకరిస్తానని తెలిపారు. టీడీపీ తరఫున జరగబోయే ప్రచార కార్యక్రమాలకు తానూ కలిసి వస్తానని రాయపాటి హామీ ఇచ్చారు.