నా నిజాయితీ, ధర్మం, పోరాటమే కాపాడిరది

అధర్మాన్ని భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొన్నా
దుష్ట శిక్షణకు మళ్లీ అవకాశం వస్తుందని ఆశిస్తున్నా
పదవీ విరమణ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు

విజయవాడ : అధర్మాన్ని ఎదుర్కోవడమే వృత్తిధర్మంగా పనిచేశానని ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తన సర్వీసులో చట్టాన్ని కాపాడేందుకు కృషి చేశా.. నేను ఎవరికీ అన్యాయం చేయలే దని వ్యాఖ్యానించారు. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికీ అన్యాయం చేయకపోవడంతోనే లక్షల మంది అభిమానం పొందానని చెప్పారు. నా నిజాయతీ, ధర్మం, పోరాటమే నన్ను కాపాడిరదని పేర్కొన్నారు. నా సర్వీసులో దుర్మార్గులనూ చూశానని వ్యాఖ్యానించారు. రిటైర్‌ అయినా నా జీవితం ఉన్నంతవరకు ప్రజాసేవలో ఉంటా..దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసేందుకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.