– రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
– వారంలో రెండు నుంచి మూడు యాక్సిడెంట్లు
– కారణలు ఏంటి? ఎవరిదీ నిర్లక్ష్యం?
హైదరాబాద్, మహానాడు: నాచారాం… ప్రజలకు నరకం చూపిస్తోంది. వారంలో రెండు నుంచి మూడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినా… కారణాలు తెలియడం లేదు… ప్రభుత్వానిదా నిర్లక్ష్యం? ట్రాఫిక్ పోలీసుల అలసత్వమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజా ఓ మాతృమూర్తి ఈ లోకాన్ని వీడింది. కుమార్తెను స్కూల్ దగ్గర వదిలిన ఆ తల్లి.. తిరిగి వచ్చే క్రమంలో హెవీ వెహికల్ చక్రాల కింద పడి దుర్మరణం పాలైంది. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ హెచ్ఎంటి గేటు వద్ద చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంగా విషాదంలో ముగినిగిపోయింది. నాచారం మెయిన్ రోడ్డు హెచ్ఎంటి నగర్ కమాన్ వద్ద గ్యాస్ సిలిండర్ హేవి వెహికల్ ఈమె వాహనాన్ని ఢీకొంది. ఆమెకు ఐదేళ్ళ కొడుకూ ఉన్నాడు. పాఠశాలకు వెళ్ళిన ఆ పాపకి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు తన తల్లి చనిపోయి వార్త తెలియదని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.