Mahanaadu-Logo-PNG-Large

క్షతగాత్రులకు నాదెండ్ల మనోహర్‌ పరామర్శ

తెనాలి ప్రభుత్వ వైద్యశాల పరిస్థితిపై ఆరా
కూటమి వచ్చాక సౌకర్యాలు మెరుగుపరుస్తామని వెల్లడి

తెనాలి: ఇటీవల రేపల్లె సమీపంలో ట్రాక్టర్‌ ప్రమాదంలో గాయపడి కొల్లిపర మండలానికి చెందిన 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. వారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాధితులను బుధవారం ఉదయం తెనాలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆర్థోపెడిక్‌ వైద్యుడు హనుమంతరావుకు సూచించారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో గతంలో దాదాపు 1200 నుంచి 1300 మంది వైద్యసేవలు పొందేవా రని, జిల్లాలోనే అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రిగా పేరుపొందిందని వివరించారు. ప్రస్తుతం ఇదే ఆసుపత్రిలో దాదాపు 300 మంది నుంచి 400 వరకు మాత్రమే వైద్యసేవలు పొందే పరిస్థితి ఉండటం దురదృష్టమన్నారు. తాము వచ్చిన తర్వాత వైద్యశాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.