– ఘన నివాళులర్పించిన మంత్రి లోకేష్
గుంటూరు, మహానాడు: జిల్లాలో భారీ వర్షాల కారణంగా మంగళగిరి పట్టణం కొత్తపేటలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ(88) భౌతిక కాయానికి ఆదివారం ఉదయం రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందించారు. అనంతరం శనివారం కొండ చరియలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని మంత్రి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ అలీం భాష, మంగళగిరి తహశీల్దార్ సుభాని, తదితరులు పాల్గొన్నారు.