రామోజీరావుకు నక్కా ఆనందబాబు సంతాపం

వేమూరు: పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో తనదైన ముద్రవేసి తెలుగువారి ఖ్యాతి ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడిరపచేసిన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా. ఆనందబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి క్రమశిక్షణతో ఎదిగిన రామోజీరావు జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చ ాలని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.