బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్
ఈవీఎం ధ్వంసంలో పేరు చేర్చలేదని వెల్లడి
మాచర్ల: పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయనకు హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపును, బెయిల్‌ను రద్దు చేయాలని నంబూరి శేషగిరిరావు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని, కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆధారాలున్నా ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండా కేసు పెట్టారని వివరించారు. గుర్తుతెలియని వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారని తెలిపారు. పై అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకో కుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని, ఆయన నుంచి రక్షణ కల్పించాలని కోరారు.